“This is a 10-team World Cup and each team plays matches against every other team and I feel if India doesn’t play a match in the World Cup, it won’t be an issue,” Ganguly told
#Worldcup2019
#souravganguly
#IndvsPak
#ICC
#msdhoni
#viratkohli
#harbhajansingh
#pulwamatragedy
#cricket
#teamindia
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. భారత్, పాకిస్థాన్ మధ్య ప్రపంచకప్‌లో భాగంగా జూన్ 16న జరగాల్సిన మ్యాచ్ గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. పాకిస్థాన్ దుశ్చర్య కారణంగా 40 మంది జవాన్లు అసువులుబాసినా.. పాక్‌తో క్రికెట్ ఆడటం అవసరమా..? ఆ మ్యాచ్‌ను బహిష్కరించి ప్రపంచకప్ వేదికగా జవాన్లకి నివాళి అర్పించాలని పెద్ద ఎత్తున అభిమానులు కోరుతున్నారు. ఒకవేళ ఆ మ్యాచ్‌ను భారత్ బహిష్కరిస్తే.. అప్పుడు పాక్ విజేతగా నిలిచి రెండు పాయింట్లు చేజిక్కించుకుంటుంది. దీంతో.. తాము ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చెప్పుకొస్తోంది. పాక్‌తో మ్యాచ్‌ను భారత్ ఆడకపోతే పాయింట్లతో పాటు.. కనీసం రూ.100కోట్లుపైనే బ్రాడ్‌కాస్టర్స్‌కి నష్టపరిహారం చెల్లించాల్సి రావొచ్చు.